Ye Nimushaaniki Yemi Jaruguno Lyrics & Tabs by Ghantasala

Ye Nimushaaniki Yemi Jaruguno

guitar chords lyrics

Ghantasala

Album : Lava Kusa (Original Motion Picture Soundtrack) telugu PlayStop

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ ...

విధివిధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ ...

కంచెయె నిజముగ చేను మేసినా కాదనువారెవరూ ...
రాజే ఇది శాసనమని పల్కిన ప్రతిఘటించువారెవరూ ...
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ ...
కరుణమయులిది కాదనలేరా ... ఖఠినకార్యమనబోరా ...
సాధ్వులకెపుడూ వెతలేనా ... తీరని ధుఃఖ్ఖపు కథలేనా ...
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ ...
ఇనకులమున జనియించిన నృపతులు ఈ ధారుణము సహించెదరా ...
వినువీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా ...
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ ...
ఎండకన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలూ ...
తరచి చూచినా బోధపడవులే దైవ చిద్విలాసాలూ ...

అగ్నిపరీక్షకె నిల్చిన సాధ్విని అనుమానించుట న్యాయమా ...
అల్పుని మాటయె జనవాఖ్యమ్మని ...
అల్పుని మాటయె జనవాఖ్యమ్మని
అనుసరించుటే ధర్మమా ... ఆ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ ...
విధివిధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ ...
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ ...
ఎవరూహించెదరూ ...

Like us on Facebook.....
-> Loading Time :0.0136 sec