Bommanu Chesi Lyrics & Tabs by Ghantasala

Bommanu Chesi

guitar chords lyrics

Ghantasala

Album : Aathma Bandhuvu / Devatha / Manchi Manishi telugu PlayStop

బ్రతుకంత బాధగా . కలలోని గాధగా .కన్నీటి ధారగా .ఆ . కరిగిపోయే .
తలచేది జరుగదూ . జరిగేది తెలియదూ .
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా .

బొమ్మను చేసి .ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా.
గారడిచేసి గుండెలు కోసి నవ్వేవు
ఈవింత చాలికా .
బొమ్మను చేసీ .ప్రాణము పోసి ఆడేవు నీకిది వే ...డుకా.
అందాలు సృష్టించినావూ . దయతో నీవూ .మరలా నీచేతితో నీవె తుడిచేవులే .
దీపాలు నీవే వెలిగించినావే ఘాఢాంధకారాన విడిచేవులే .
కొండంత ఆశా అడియాశ చేసి .
కొండంత ఆశా అడియాశ చేసి .
పాతాళలోకాల తోసేవులే ...
బొమ్మను చేసి ...ప్రాణము పోసి ఆడేవు నీకిది వే .డుకా.
ఒకనాటి ఉద్యానవనమూ . నేడు కనమూ ...
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే ...

బొమ్మను చేసి ...ప్రాణము పోసి ఆడేవు నీకిది వే .డుకా.
ఒకనాటి ఉద్యానవనమూ . నేడు కనమూ ...
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే ...
ఒకనాటి ఉద్యానవనమూ . నేడు కనమూ ...
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే ...
అనురాగమధువు అందించి నీవూ
హాలాహలజ్వాల చేసేవులే .
ఆనందనౌకా పయనించువేళా .
ఆనందనౌకా పయనించువేళా . శోకాల సంద్రాల ముంచేవులే .
బొమ్మను చేసీ . ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా .ఆ...
గారడి చేసీ . గుండెలు కోసి . నవ్వేవు ఈవింత చాలిక.
బొమ్మను చేసి .ప్రాణము పోసి ఆడేవు నీకిది వే ... డుకా.

Like us on Facebook.....
-> Loading Time :0.0117 sec