Thakita Thadhimi Lyrics & Tabs by S. P. Balasubrahmanyam

Thakita Thadhimi

guitar chords lyrics

S. P. Balasubrahmanyam

Album : Sankarabharanam / Sagarasangamam melodious PlayStop

తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన
తకిట తదిమి తకిట తదిమి తందాన

హృదయలయల జతుల గతుల తిల్లాన
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాల
శృతిని లయని ఒకటి చేసి
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన

హృదయలయల జతుల గతుల తిల్లాన
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా
తెలుస మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల లలల లలలా
ఏటి లోని అలలవంటి కంటి లోని కలలు కదిపి గుండియలను అందియలుగ చేసి
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
తడబడు అడుగుల తప్పని
తకిటతోం తకిటతోం తకిటతోం
తడిసిన పెదవుల రేగిన
ఆ ఆ ఆ...
శృతిని లయని ఒకటి చేసి
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
అలరులు కురియగ నాడెనదే అలకల కులుకుల అలమేల్మంగ
అలరులు కురియగ నాడెనదే ఈ ఈ అలకల కులుకుల అలమేల్మంగ
అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెనుగు పాట పల్లవించు పద కవితలు పాడి
ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన
శృతిని లయని ఒకటి చేసి
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన

Like us on Facebook.....
-> Loading Time :0.0231 sec