Nuvvante Nakishtamani Lyrics & Tabs by Telugu

Nuvvante Nakishtamani

guitar chords lyrics

Telugu

Album : Santhosam, MurariPlayStop

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగా

నీ నీడలో అణువణువు ఆడగా
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
నువ్వు నా వెంట ఉంటె అడుగడుగునా నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కళ నిజమల్లె కనిపించదా
నిన్నిలా చూస్తూ ఉంటె మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగా అనిపించదా
వరాలన్నీ సూటిగా ఇలా నన్ను చేరగా
సుదూరాల తారక సమీపాన వాలగా
లేనేలేదు ఇంకే కోరికా...
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస

సుదూరాల తారక సమీపాన వాలగా
లేనేలేదు ఇంకే కోరికా...
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం
నిన్నగా సన సన్నగా చేజరిపోనీయకా...
చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగా మన పాపగా పుడుతుంది సరి కొత్తగా
నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా
ప్రతీ రేయి తీయగా పిలుస్తోంది హాయిగా
ఇలా ఉండిపోతే చాలుగా...
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
ఈ నవ్వులో శృతి కలిపి పాడగా
ఈ నీడలో అణువణువు ఆడగా
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
(దిలీప్ చక్రవర్తి)

Like us on Facebook.....
-> Loading Time :0.0080 sec