Oka Devata - female Lyrics & Tabs by S. A. Rajkumar

Oka Devata - female

guitar chords lyrics

S. A. Rajkumar

Album : Ninne Premistha tamil PlayStop

ఒక దేవత వెలసింది నాకోసమే
Movieనిన్నేప్రేమిస్తా
Star Castనాగార్జున, శ్రీకాంత్, సౌందర్య

Year2000
Lyricistవెనిగళ్ళ రాంబాబు
Singer(s)SP. బాలు
MusicSA. రాజ్ కుమార్
ఒక దేవత వెలసింది నీకోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
ఒక దేవత వెలసింది నాకోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా
సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా
శ్రీరస్తంటూ నాతో అంది ఇలా

సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా
శ్రీరస్తంటూ నాతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని
ఒక దేవత వెలసింది నాకోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
విరిసే వెన్నెల్లోన మెరిసే కన్నులోన
నీ నీడే చూశానమ్మా
ఎనిమిది దిక్కుల్లోన ముంగిలి చుక్కల్లోన
నీ జాడే వెతికానమ్మా
నీ నవ్వే నా మదిలో అమృతవర్షం
ఒదిగింది నీలోనే అందని స్వర్గం
నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి
మునుముందుకు వచ్చేనే చెలినే చూసి
అంటుదమ్మా నా మనసే
నిన్నే ప్రేమిస్తానని
ఒక దేవత వెలసింది నాకోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగ పోసి
పూయించా నీ జడకోసం
రోజూ ఉపవాసంగా హృదయం నైవేద్యంగా
పూజించా నీ జతకోసం
నీరెండకు నీవెంటే నీడై వచ్చి
మమతలతో నీ గుడిలో ప్రమిదలు చేస్తా
ఊపిరితో నీ రూపం అభిషేకించి
ఆశలతో నీ వలపుకు హారతులిస్తా
ఇన్నాళ్ళూ అనుకోలేదే
నిన్నే ప్రేమిస్తానని
ఒక దేవత వెలసింది నాకోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా
సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా
శ్రీరస్తంటూ నాతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని
ఒక దేవత వెలసింది నాకోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

Like us on Facebook.....
-> Loading Time :0.0096 sec