Mukundha Mukundha Lyrics & Tabs by Himesh Reshammiya, Sadhana Sargam & Kamal Haasan

Mukundha Mukundha

guitar chords lyrics

Himesh Reshammiya, Sadhana Sargam & Kamal Haasan

Album : Dhasavathaaram (Original Motion Picture Soundtrack)PlayStop

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగ బృందావనం లో వరంగా ||2||
వెన్న దొంగ వైనా... మన్ను తింటివా

కన్నె గుండె ప్రేమ లయల మృదంగానివా. ||ముకుందా ముకుందా||
జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే
నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే ||ముకుందా ముకుందా||
నీలాల నింగి కింద తేలియాడు భూమి
తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి
పడగ విప్పి మడుగున లేచే సర్ప శేషమే ఎక్కి
నాట్యమాడి కాళేయుని దర్పమణిచాడు
నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానమేగా
అజ్ఞానం రూపు మాపే కృష్ణ తత్వమేగా
అట అర్జునుడొందెను నీ దయ వల్ల గీతోపదేశం
జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం
వేదాల సారమంతా వాసు దేవుడే.

అట అర్జునుడొందెను నీ దయ వల్ల గీతోపదేశం
జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం
వేదాల సారమంతా వాసు దేవుడే.
రేపల్లె రాగం తాళం రాజీవమే ||ముకుందా ముకుందా||
మత్స్యమల్లె నీటిన తేలి వేదములను కాచి
కూర్మ రూప ధారివి నీవై భువిని మోసినావే
వామనుడై పాదమునెత్తి నింగి కొలిచినావే
నరసింహుని అంసే నీవై హిరణ్యుని చీల్చావు
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
క్రిష్నుడల్లె వేణువూది ప్రేమను పంచావు
ఇక నీ అవతరలెన్నెన్నున్నా ఆధారం నేనే
నీ ఒరవడి పట్టా ముడి పడి వుంటా ఏదేమైనా నేనే
మది లోని ప్రేమ నీదే మాధవుడా
మందార పువ్వే నేను మనువాడరా (ముకుందా ముకుందా) ||2||

More tracks of "Himesh Reshammiya, Sadhana Sargam & Kamal Haasan"

Like us on Facebook.....
-> Loading Time :0.0086 sec