Megha Chai Lyrics & Tabs by Various Artists

Megha Chai

guitar chords lyrics

Various Artists

Album : Gadar: Ek Prem Katha electronic PlayStop

ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్
ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్
ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్,

ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్
ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్
ఈ ఛాయ్ నవాబుకి బంధువే నోయ్
ఏ ఛాయ్ మనస్సుకీ మందురా భాయ్
ఈ ఛాయ్ గలాసుకీ జై జై ||ఛాయ్||
చరణం 1
డ్రైవర్ బాబులకూ ఈ ఛాయ్ పెట్రోలు
డాక్టర్ బాబులకూ ఈ ఛాయే టానిక్కూ
లేబర్ అన్నలకూ టీనీళ్ళే తీర్ధాలు,
విద్యార్ధుల చదువులకు టీనీళ్ళే విటమిన్లూ
తెల్ల దొరలు ఇండియాకు తెచ్చారుటీ,
ఆ టీ తాగి వాళ్ళతోటి వేసాము బేరి

విద్యార్ధుల చదువులకు టీనీళ్ళే విటమిన్లూ
తెల్ల దొరలు ఇండియాకు తెచ్చారుటీ,
ఆ టీ తాగి వాళ్ళతోటి వేసాము బేరి
అన్నాడు అలనాటి ఆ శ్రీశ్రీ, తనుటీ తాగడంలో ఘునాపాటి
టీ వల్ల లాభాలు శతకోటి,
ఆ లిస్టంతా అవుతుంది రామకోటి ||ఛాయ్||
చరణం 2
అల్లం టీ అంటే అదిపెంచెను ఆరోగ్యం
మసాలా టీ అంటే అది దించునురా మైకం
లెమన్ టీ కొడితే ఇక లేజీ మటుమాయం
ఇరానీ టీ పడితే ఇటురాదా ఆ స్వర్గం
కేపుల్లో దాబాల్లో ఫైవ్ స్టార్ హొటల్లో
ఎక్కడైనా దొరికేది ఏంటీ – టీ టీ
సినిమాహాలల్లో విశ్రాంతి వేళల్లో తప్పకుండా తాగేది ఏంటీ – టీ అన్నా
టీ కొట్టుతోనే బతుకుతారు కొందరు
టీ కొడితేనే బతుకుతారు అందరూ ||ఛాయ్||
[చిరు] ఎలా ఉందండీ
ఆ సూపర్
[చిరు] ఆ . . . లేకపోతే ఛాయ్ని ఛీ ఛీ అంటారా
ఇంక అనను
[చిరు] ఉంటానండీ

Like us on Facebook.....
-> Loading Time :0.0464 sec