Andamaina Vennelalona Lyrics & Tabs by Chitra, K. V. Mahadevan & K. J. Yesudas

Andamaina Vennelalona

guitar chords lyrics

Chitra, K. V. Mahadevan & K. J. Yesudas

Album : Assembly Rowdy (Original Motion Picture Soundtrack)PlayStop

అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే
మల్లెపూల పందిరిలోకి నడిచిరావే సరిగమలా
మనసు నిండా మరులు పండా పసిడి పల్లకి ఎక్కాలా

రాగాలే ఊగాల శివరంజి నవ్వాల
గరిసదస గరిసదస గరిసదస
చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలే
ముద్దబంతి ముగ్గులోకి సాగిరారా మగసిరిలా
కనుల నిండా కలలు పండా పూలపడవ నడపాలి
అందాలే చిందాలి అపరంజి నవ్వాలి
గరిసదస గరిసదస గరిసదస
అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే
ముద్దబంతి ముగ్గులోకి సాగిరార మగసిరిలా
నురుగు తరగల గోదారి వలపు మిల మిల మెరవాల
ఒంపుసొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాల
నురుగు తరగల గోదారి వలపు మిలమిల మెరవాల

నురుగు తరగల గోదారి వలపు మిల మిల మెరవాల
ఒంపుసొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాల
నురుగు తరగల గోదారి వలపు మిలమిల మెరవాల
ఒంపుసొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాల
కొమ్మ మీద కోకిలనై కొత్త రాగం పలకాల
గుడికి నేను దీపమునై కోటి వెలుగులు కురియాల
కంటి పాపనై కాలి అందెనై
కంటి పాపనై కాలి అందెనై
కాలమంతా కరగబోసి కాపు ఉండనా
సరీగ రిగాప గపాద పదాస
గరిసదస గరిసదస గరిసదస
చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలే
మల్లెపూల పందిరిలోకి నడిచిరావే సరిగమలా
ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాల
సందె చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాల
ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాల
సందె చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాల
ఈడు జోడు ఎలుగెత్తి ఏరువాక పాడాల
తోడు నీడ ఇరువురమై గూటికందం తేవాల
తీగమల్లెనై తేనెజల్లునై
తీగమల్లెనై తేనెజల్లునై
కోరికంతా కూడబెట్టి కొలువు సేయనా
సరీగ రిగాప గపాద పదాస
గరిసదస గరిసదస గరిసదస
అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే
మల్లెపూల పందిరిలోకి నడిచిరావే సరిగమలా
కనుల నిండా కలలు పండా పూలపడవ నడపాలి
అందాలే చిందాలి అపరంజి నవ్వాలి
గరిసదస గరిసదస గరిసదస

Like us on Facebook.....
-> Loading Time :0.0062 sec