Ve Vela Gopemmala Lyrics & Tabs by S. P. Balasubrahmanyam

Ve Vela Gopemmala

guitar chords lyrics

S. P. Balasubrahmanyam

Album : Compilation melodious PlayStop

వే వేల గోపెమ్మల
మువ్వ గోపాలుడే
మా ముద్దు గోవిందుడే

మువ్వ గోపాలుడే
మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నుల
కన్నుల వెన్నెల వేణువులూదాడే
మది వెన్నెలు దోచాడే
అహహ వే వేల గోపెమ్మల
మువ్వ గోపాలుడే
మా ముద్దు గోవిందుడే
మన్ను తిన్న చిన్నవాడే
నిన్ను కన్న వన్నెకాడె
మన్ను తిన్న చిన్నవాడే
నిన్ను కన్న వన్నెకాడె

నిన్ను కన్న వన్నెకాడె
మన్ను తిన్న చిన్నవాడే
నిన్ను కన్న వన్నెకాడె
కన్న తోడు లేని వాడే
కన్నె తోడు వున్నవాడె
మోహనాల వేణువూదే
మోహనాంగుడితడేనే
మోహనాల వేణువూదే
మోహనాంగుడితడేనే
చీరలన్నీ దోచి
దేహ చింతలన్నీ తీర్చినాడే
పోతన్న కైతలన్నీ పోతపోసుకున్నాడే
మా మువ్వ గోపాలుడే
మా ముద్దు గోవిందుడే
అహహ వేవేల గోపెమ్మల
మువ్వ గోపాలుడే
మా ముద్దు గోవిందుడే
వేయి పేరులున్నవాడే
వేల తీరులున్నవాడే
వేయి పేరులున్నవాడే
వేల తీరులున్నవాడే
రాస లీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే
గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే
నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే
మా మువ్వ గోపాలుడే
మా ముద్దు గోవిందుడే
అహహ వేవేల గోపెమ్మల
మువ్వ గోపాలుడే
మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నుల
కన్నుల వెన్నెల వేణువులూదాడే
మది వెన్నెలు దోచాడే
అహ అన్నుల మిన్నుల
కన్నుల వెన్నెల వేణువులూదాడే
మది వెన్నెలు దోచాడే
అహహ వేవేల గోపెమ్మల
మువ్వ గోపాలుడే
మా ముద్దు గోవిందుడే

Like us on Facebook.....
-> Loading Time :0.0131 sec