Jallantha Lyrics & Tabs by Chitra

Jallantha

guitar chords lyrics

Chitra

Album : Geetanjali (Original Motion Picture Soundtrack) hindi PlayStop

గానం: చిత్ర
సాహిత్యం: వేటూరి
సంగీతం: ఇళయరాజా

జల్లంత కవ్వింత కావలి లే
ఒళ్ళంత తుళ్ళింత రావలిలే. \\2\\
ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చింది లే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చింది లే \\2\\
వాగులు వంకలు గల గల చిలిపిగా పిలిచినా.
గాలులు వానలు చిట పట చినుకులే చిలికినా.
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు బొండుమల్లె తేనేనొక్క ముద్దులాడి
వెళ్ళదాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి. \\జల్లంత\\

తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు బొండుమల్లె తేనేనొక్క ముద్దులాడి
వెళ్ళదాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి. \\జల్లంత\\
సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలపగా.
తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా.
వాన దేవుడే కళ్ళాపి జల్లగా
వాయు దేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలి కొండ గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరి కోసమో ఓహో. \\జల్లంత\\

Like us on Facebook.....
-> Loading Time :0.0164 sec