Ele Ele Maradalaa Lyrics & Tabs by M.M. Keeravani

Ele Ele Maradalaa

guitar chords lyrics

M.M. Keeravani

Album : Annamayya indian PlayStop

ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు

నీకే ఇస్తా సోకులు
ఇచ్చేయి పచ్చారు సొగసులు
చాలు నీతోటి
అహ చాలు నీతోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా
గాటపు గుబ్బలు కదలగ కులికేవు
మాటల తేటల మరదలా
వేటరి చూపులు విసురుచు మురిసేవు
వాటపు వలపుల వరదలా
చీటికి మాటికి చనకేవు
చీటికి మాటికి చనకేవు

వాటపు వలపుల వరదలా
చీటికి మాటికి చనకేవు
చీటికి మాటికి చనకేవు
వట్టి బూటకాలు మాని పోయే బావ
చాలు చాలు నీతోటి
అహ చాలు నీతోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా...
కన్నుల గంటపు కవితలు గిలికేవు
నా ఎద చాటున మరదలా
పాడని పాటల పైటలు సరిదేవు
పల్లవి పదముల దరువులా
కంటికి వంటికి కలిపేవు
కంటికి వంటికి కలిపేవు
ఎన్ని కొంటె లీలలంట కోలో బావ
అహ పాడుకో పాట
జంట పాడుకున్న పాట జాజిపూదోట

Like us on Facebook.....
-> Loading Time :0.0120 sec